నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేటలో పశువైద్యుడు గజ్జె నాగేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం లేగదూడల అందాల పోటీల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేడీ డాక్టర్ మహేశ్వరుడు మాట్లాడుతూ...... రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా అమలవుతున్న కృత్రిమ గర్భాధారణను వినియోగించుకుని మేలుజాతి దూడలు ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులను కొప్పోలు దేవదాసు ఆకుతోటి గంగాధర్, గుంజి ప్రసాద్, ఊటి సురేష్‌లకు అందజేశారు.