గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన కరణం అనిల్ కుమార్, హరిత దంపతులు శనివారం వెండి వస్తువులను అందజేసినట్లు ఆలయం ఏఈఓ ధనుంజయ తెలిపారు.1500 గ్రాముల వెండి పళ్ళెం,చెంబు అందజేశారని ఆయన అన్నారు.ఆలయ అర్చకులు దాతల పేరిట శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.