తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొనసాగుతుంది. నేడు పాదయాత్రలో నారా లోకేశ్ బీసీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిని చూస్తే జాలేస్తోందని అన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక మంత్రి పేషీకి తాళం వేశారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నిధులు కేటాయించి కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని, ఉపకులాల వారీగా నిధులు కేటాయిస్తామన్నారు.