శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఈ నెల 21న భారత్కు రానున్నారు. రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా ఆయన భారత్కు వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పర్యాటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వ్యవసాయం, విద్యుత్, ఇంధనం, నౌకాయానం తదితర అంశాలపై చర్చలు జరుపుతారు.