ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణ హత్య జరిగింది. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోన్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్ (9)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యార్థి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. వసతి గృహ సిబ్బంది పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.