ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో సోమవారం రాత్రి 8.28 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సముద్ర గర్భంలో 10 కి.మీ లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. ఇక అంటిగ్వా, బార్బుడాలో కూడా మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించిందని పేర్కొంది. దీని తీవ్రత 6.6గా ఉందని తెలిపింది.