గ్రామాల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై ఎమ్మెల్యే ఆర్కే తీవ్రంగా ఖండించారు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆప్యాయంగా పలుకరించే వలంటీర్ సోదరులకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లుగా దాదాపు 53 శాతం మంది యువతులు సేవలందిస్తుండగా సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారని ఆర్కే ప్రశ్నించారు. ‘సేవా భావంతో పనిచేసే వలంటీర్ల జోలికొస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. వలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. పవన్ తీరు మార్చుకోకపోతే మహిళలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.