మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటించగలరా? అని పవన్ కళ్యాణ్‌కు వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేసిన పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంతకీ ఉభయగోదావరి జిల్లాల్లో మీ అభ్యర్థులెవరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతోనే పవన్ పావులు కదుపుతున్నారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 34 సీట్లలో పోటీ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయని.. అసలు ఆ సీట్లలో ఎన్నింటిలో పోటీ చేస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.