"హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ మారుతుంది జాగ్రత్త" అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయన మాట్లాడుతూ.. అందరూ అనట్లేదు కానీ కొందరు వాలంటీర్లు ప్రజలను పరోక్షంగా భయపెడుతున్నారు. కొందరు వాలంటీర్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికే. వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడు. ఇది వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలి అని హితువు పలికారు.