హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు, మండి మరియు లాహౌల్-స్పితి జిల్లాలలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వలన సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి ఏరియల్ సర్వే నిర్వహించారు.కులు జిల్లాలోని కులు, భుంటార్, సైంజ్, కసోల్ మరియు ఖీర్‌గంగా సహా వివిధ ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి సందర్శించారు. వరదల వల్ల నష్టపోయిన వారితో మాట్లాడి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేసి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, తక్షణమే కోటి రూపాయల సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.