ఏపీ ప్రభుత్వం మరో 2 వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వద్ద రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని అప్పుగా తెచ్చింది. 18 ఏళ్ల కాలపరిమితితో 7.43 శాతం వడ్డీకి రూ. 1000 కోట్లను, 19 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 1000 కోట్లు రుణం తీసుకుంది. రూ. 2 వేల కోట్లు నేడు ప్రభుత్వం ఖజానాకు చేరే అవకాశముందని తెలుస్తోంది.