దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా, మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో వీటి ధర రూ.200 పలుకుతుండగా, పుట్టినరోజు వేడుక జరుపుకొన్న ఓ మహిళకు ఆమె బంధువులు 4 కిలోలకు పైగా టమాటాలు కానుకగా ఇచ్చి దీవించారు. కల్యాణ్ పట్టణం కొచాడి ప్రాంతానికి చెందిన సోనాల్ బర్సే తనకు పుట్టినరోజు కానుకగా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకొని కేక్ కట్ చేశారు. ఈ కానుకలు తనను ఎంతో సంతోషపరిచాయని తెలిపారు.