ఓ డిప్యూటీ కలెక్టర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలో జరిగింది. డిప్యూటీ కలెక్టర్ సునీల్ యాదవ్ ఝా(56) ఆదివారం గిరిజన బాలికల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ప్రిన్సిపాల్ ను బయటే ఉండమని చెప్పి, బాలికలను గదిలోకి తీసుకెళ్లాడు. మంచంపై కూర్చొని వారిపై చేతులు వేయడం, కౌగిలించుకోవడం వంటివి చేశారు. బాలికలు ఇబ్బందిపడేలా ప్రశ్నలు వేశారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసి, అరెస్టు చేశారు.