national | Suryaa Desk | Published :
Wed, Jul 12, 2023, 10:14 AM
టీచర్ కొట్టాడనే మనస్థాపంతో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జార్ఖండ్‌లోని ధన్బాద్లో జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని నుదుటిపై బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాల ఆవరణలోనే అందరి ముందు ఆ విద్యార్థినిని చితకబాదాడు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఇంటికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com