ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ స్కూల్ బస్సు రాంగ్ రూట్లో వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.