కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు చెందిన 120 మంది భక్తులు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా కొండాపురం మండలంలోని గండ్లూరు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం కొద్దిసేపు సేద తీరారు. గత 25 సంవత్సరాలుగా తమ ప్రాంతం నుంచి సుమారు 500 కిలోమీటర్లు ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్నామని వారు తెలిపారు.