నెల్లూరు నగరంలోని 8వ డివిజన్ నవాబుపేట సెంటర్, కుమ్మరివీధి, నాగేంద్ర నగర్, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ బుధవారం పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఒక్క రూపాయి పని చేసి వంద రూపాయల పని చేసామని డప్పు కొట్టుకునేలా కాకుండా అభివృద్ధి పనులు చేస్తూ నెల్లూరు ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.