ప్రకాశంజిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు శిద్దా రాఘవరావు రాజకీయాలలో మంచి పేరుపొందారు. అయితే 2014 ఎన్నికలలో టిడిపి తరఫున దర్శి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన విజయాన్ని అందుకున్నారు. తరువాత మొదటిసారి శాసనసభకు ఎన్నికైన శిద్దా రాఘవరావుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటవీశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా జిల్లా అభివృద్ధికి శిద్దా రాఘవరావు విశేష కృషి చేశారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులని బట్టి ఆయనకి ఎక్కడ సీటు కేటాయిస్తారో అర్ధం కానీ పరిస్థితి, అలానే కొన్ని వర్గాలు అసలు ఆయనకి సీటు లేదు అనే వార్తని సంభాషిస్తున్నట్లు సమాచారం. చివరికి ఏమి జరుగుతుందో చూడాలి మరి.