ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నుంచి రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. పారిస్‌లో జులై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులనూ మోదీ కలుస్తారు. జులై 15న ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించనున్నారు.