ఛత్తీస్‌గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి పదవికి ప్రేంసాయి సింగ్ టేకం గురువారం రాజీనామా చేశారు. ఈ నిర్ణయం తనది కాదని అన్నారు. గతంలో ఆయన ఓ కార్యక్రమంలో హరివంశ్ రాయ్ బచ్చన్ పురాణ పుస్తకం 'మధుశాల'లో కొన్ని లైన్లను చదివారు. 'మద్యం ప్రజలను ఏకం చేస్తుంది. కానీ మద్యం తక్కువ స్థాయిలో తీసుకోవాలి' అని వ్యాఖ్యానించారు. ఇవి వివాదాస్పదం అయ్యాయి. ఏఐసీసీ సూచనతో ఆయనను రాజీనామా చేయాలని సీఎం భూపేష్ బఘేల్ కోరారు.