ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ ఓ రౌడీ బాయ్ అని, చాలామంది జగన్ ను జగ్గూభాయ్ అని పిలుస్తారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్పై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీని జగన్ అనే జలగ పట్టి పీడిస్తోందని అన్నారు. వైసిపి పాలనలో అవినీతి, అరాచకాలు తారాస్థాయికి చేరాయన్నారు. సీఎం జగన్తో తనకు వ్యక్తిగత వైరం లేదని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే వారిపై పోరాడుతున్నారన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదని పవన్ అన్నారు.