భారత నౌకాదళం కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలు మరియు మూడు స్కార్పెన్ క్లాస్ సంప్రదాయ జలాంతర్గాములను కొనుగోలు చేసే ప్రణాళికలను భారత రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం (జూలై 13) ఆమోదించింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రక్షణ మంత్రి రాజంత్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు హాజరైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు నివేదించాయి. భారత నావికాదళానికి 22 సింగిల్ సీట్ రాఫెల్ మెరైన్ విమానాలతో పాటు నాలుగు ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు లభిస్తాయి. భారత ప్రధాని ఫ్రాన్స్‌లో జూలై 14న బాస్టిల్ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా పాల్గొంటారు.