ఏపీలో నేడు కాలేజీల బంద్ కు ప్రైవేటు డిగ్రీ కాలేజీలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఫీజులను వ్యతిరేకిస్తున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయని తెలుస్తోంది. ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, ఫీజులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఫీజులతో కాలేజీల నిర్వహణ కష్టమని, శాస్త్రీయ విధానం లేకుండా ఫీజులను నిర్ణయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.