ఆపదలో రక్తదానం చేసి, ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని జాతీయ రక్తదాతల జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం హిందూపురం పట్టణంలోని రక్తదాతల జేఏసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్, డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ మాట్లాడారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసే వారికి రూ. 10 లక్షల ఉచిత బీమా అందించాలన్నారు.