రాష్ట్ర దేవాదాయ శాఖ అర్చక సిబ్బంది పదవీ విరమణను వయసును 62 ఏళ్లకు పెంచుతూ వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు, సిబ్బంది గురువారం హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రతులను చూపుతూ ఆలయం ఎదుట నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఇఓ ధనుంజయ, ప్రధాన అర్చకులు గరుడా చార్యులు తదితరులు పాల్గొన్నారు.