వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం అనంతపురం రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్వీ నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. శింగనమలలో ఎర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ తీరును తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇతరులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.