అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం ది ఓలేహా పట్టణానికి చెందిన ఎలిసబెత్ అండర్సన్‌కు ముగ్గురు పిల్లలు. ఆమెకు పిల్లలు పుట్టి పెద్దవాళ్లయినా పాలధార ఆగలేదు. నిత్యం ఆమె నుంచి తల్లిపాలు ఓవర్ ఫ్లో అయ్యేది. హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ వల్లే ఆమెలో పాల ఉత్పత్తి జరుగుతోందని వైద్యులు చెప్పారు. దాంతో ఆ పాలను ఆమె అమెరికాలోని ఓ మిల్క్ బ్యాంక్‌కు దానం చేస్తూ వచ్చింది. మూడేళ్లలో 1600 లీటర్ల పాలను దానం చేసి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది.