ఓ మహిళ ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకున్న ఘటన జమ్ముకశ్మీర్ లో జరిగింది. తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరి ఫోటోల్లో ఉన్న మహిళ ఒకరే కావడంతో మాయలేడి మోసం బయటపడింది. పెళ్లిచేసుకున్న వారితో 20 రోజులు ఉండి, డబ్బు, బంగారంతో పారిపోయేది. ఇలా 27 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా 'ఇదేదో నెట్ ఫ్లిక్స్ షోలాగే ఉంది' అని ట్వీట్ చేశారు.