అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం నెలకొంది. జార్జియాలోని హెన్రీకౌంటిలో ఉన్న హాంప్టన్ ప్రాంతంలో ఓ దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు హాంప్టన్కు చెందిన ఆండ్రీ లాంగ్మోర్గా గుర్తించారు. అతడిని పట్టించిన వారికి 10 వేల డాలర్లు రివార్డును ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు.