ఇకపై నూర్బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా వైఎస్సార్ షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని దూదేకుల ప్రతినిధులు ఇటీవల సీఎం జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.