మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లో కూలిపోతుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలలో పూర్తిగా మునిగిపోయి ఎన్నికలను రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ పెద్దఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడి ఉండకపోతే బీజేపీ వేల స్థానాల్లో విజయం సాధించి ఉండేదని అన్నారు.