జగనన్న తోడు పథకంలో భాగంగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని ప్రభుత్వం రేపు నిర్వహించనుంది. 5.1 లక్షల మంది ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున రూ. 510 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. అంతేకాకుండా, వడ్డీమాఫీ కింద 4.58 లక్షల మందికి రూ. 10.03 కోట్లను చెల్లించనుంది. రాష్ట్రంలోని చిరువ్యాపారులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం వడ్డీ లేకుండా రూ. 10 వేల రుణాన్ని అందిస్తోంది.