ఏపీలో కొత్తగా 12 సౌరవిద్యుత్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. అనంతపురం, తిరుపతి, విజయవాడ నగరాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ కేందాలలో కార్డు ద్వారా ఛార్జింగ్ ఫీజు చెల్లించి, వాహనదారుడే స్వయంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ కేంద్రాల్లో సౌర ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీలో స్టోర్ కానుంది. ట్రాఫిక్ కు ఇబ్బంది లేని చోట వీటిని ఏర్పాటు చేయనున్నారు.