ఏపీలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 1.67 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల మంది నిరుపేదలకు 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని, దీనికోసం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు.