దేశంలో భారీగా పెరిగిన టమాటా ధరలు నెల రోజుల్లోనే ఓ రైతును కోటీశ్వరుడ్ని చేశాయి. ఛత్తీస్‌గఢ్ ధమ్‌తరీ జిల్లాలోని బీరన్ గ్రామానికి చెందిన అరుణ్ సాహూ 150 ఎకరాల్లో టమాటా సాగు చేసాడు. రోజుకు 600 నుంచి 700 పెట్టెల టమాటాలు విక్రయించాడు. ఈ నెల కాలంలో రూ. కోటికి పైగా సంపాదించాడు. ఉన్నత విద్య చదివిన సాహూ, వ్యవసాయరంగంపై మక్కువతో సాగులోకి దిగినట్లు తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa