చంద్రబాబుకు ఇదే ఆఖరి పోరాటమని, అందుకే ఖరీదైన దుష్ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సెంటిమెంట్లతో చంద్రబాబు ఆడుకుంటున్నాడని అన్నారు. ఏకపత్నీవ్రతుడైన రాముడి ఇల్లాలు సీతమ్మ వారి ప్రస్తావన కూడా చంద్రబాబు తీసుకొస్తున్నాడని, పోలికలకు కూడా ఒక హద్దు ఉంటుందన్నారు. అందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.