తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి దాడులు నిర్వహించింది. ఇటీవల మంత్రి వి.సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడి ఇంటిపై సోమవారం ఉదయం దాడి చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ దాడులు జరిపినట్లు తెలుస్తోంది.