తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎస్ఐ రవిబాబు ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటు ఉన్న మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్‌రెడ్డిని కూడా కౌన్సెలింగ్‌కు పిలిచారు. దాంతో నాయకుడినైన తనకు ఇలా కౌన్సెలింగ్ ఇవ్వడం ఏంటంటూ సునీల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాటమాటా పెరగటంతో అతనిని , పోలీ్సస్టేషన్లోని ఓ గదిలో నిర్బధించారు. ఇది తెలుసుకున్న అయన కార్యకర్తలు తమ నేతను విడిచి పెట్టాలంటూ ధర్నాకు దిగారు. తనను అకారణంగా ఎస్ఐ దూషించి.. తీవ్రంగా కొట్టారని, సెల్‌ఫోన్, రూ.2.80 లక్షలను కూడా పోలీసులు మాయం చేశారని సునీల్‌రెడ్డి మీడియా ఎదుట ఆరోపించారు.