వైసీపీ పాలనతో రాష్ట్రానికి రాజధాని ఎదో చెప్పలేని స్థితిలో ఉన్నామని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుయాత్ర సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ చార్జీలు ఏడుసార్లు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారన్నారు. 2024లో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీపై వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో ప్రతి కుటుంబానికీ ఏడాదికి లక్షా 22వేల రూపాయలు అందుతాయని స్పష్టం చేశారు.