ఇండోనేషియాలోని సులవేసిలో టార్జా అనే ప్రదేశంలో నివసించే ఓ గిరిజన తెగ వాళ్లు తమ కుటుంబసభ్యులు, పూర్వీకుల మృతదేహాలను ఇంట్లోనే భద్రపరుచుకుంటారు. ఇది అనాధిగా ఈ తెగలో వస్తున్న సంప్రదాయం. సాధారణంగా మనిషి చనిపోతే మృతదేహానికి దహన సంస్కారాలు చేస్తారు. కానీ శవపేటికలో పెట్టి మృతదేహాన్ని భద్రంగా దాచుకుంటారు. చనిపోయిన వారిని ఆనారోగ్యంతో ఉన్నాడని భావించి మృతదేహాన్ని ఇంట్లో ఉంచుతారు. ఇంటికి వచ్చే అతిథులను వారికి పరిచయం చేస్తారు. వారితో మాట్లాడుతారు. బ్రతికి ఉన్నాడనే భ్రమలో జీవిస్తుంటారు. దుర్వాసన రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తారు.