డోన్ పట్టణం పరిధిలో సెల్ఫోన్ లని దొంగతనం చేసే ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పట్టణ వివరాల్లోకి వెళ్ళితే.... పట్టణంలోని చిగురుమానుపేటకు చెందిన ఎరుకలి లక్ష్మీనారాయణ, ఎరుకల సాయికుమార్, ఎరుకల ఉమేశ్ చంద్ర, ఎరుకల కుమార్, ఎరుకుల కావడి కుమార్, ఎరుకల కావడి బాలు చెన్నై, తిరుపతి, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంచుకుని సెల్ఫోన్ల దొంగతనాలు చేసేవారు. దొంగలు ఇచ్చిన సెల్పోన్లను నిజాముద్దిన్ అనే వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారు. గత వారం క్రితం చెన్నైకి వెళ్లి 41 సెల్ఫోన్లు దొంగతనం చేసి వచ్చిన వీరు పట్టణంలోని గుత్తి రోడ్డు రుద్రాక్షగుట్ట ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులు దాడులు నిర్వహించి అరెస్టు చేశారు. వారి నుంచి 41సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నారు.