చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ గత మూడు వారాలుగా కనిపించడం లేదు. చివరిసారిగా జూన్ 25న శ్రీలంక విదేశాంగ మంత్రితో జరిగిన ఓ మీటింగ్ లో కనిపించారు. అయితే ఇటీవల యూఎస్ సంబంధాలు బలపర్చేందుకు జరుగుతున్న ఉన్నతస్థాయి దౌత్య ప్రయత్నాలు ఊపందుకునే సమయంలో ఆయన కనిపించకపోవడం చర్చనీయంశంగా మారింది. కాగా, క్వీన్ మిస్సింగ్ వెనక అనారోగ్యం కానీ, రాజకీయపరమైన కారణం ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.