వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి, వ్యవసాయ కూలీలకు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తుందని, కావున వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ మంగళవారం చేశారు. అనంతరం పత్తికొండ ఎంపీడీవో ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ దస్తగిరికి వినతిపత్రం అందజేశారు.