గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మహేంద్రతనయనది నుంచి వస్తున్ననీరు అధికంగా ప్రవహించడంతో పంట పొలాలు చెరువులుగా కనిపిస్తున్నాయి. సారవకోట మండలంలో నవతల గ్రామ పరిధిలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ గ్రూపు పరిధిలో ఉన్న పొలాలు మహేంద్రతనయ కాలువ కింద ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరి నాట్లు నీటిలో మునిగి పొయాయి. వరి సాగు ప్రారంభ దశలో చేలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa