ఎవరిదైనా ఓటు తొలగించేముందు తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. మరణించిన ఓటర్ల పేర్లను కూడా, సంబంధిత కుటుంబానికి నోటీసు ఇచ్చిన తరువాత మాత్రమే తొలగించాలని స్పష్టం చేశారు. ఇచ్చిన నోటీసులను, ధరఖాస్తులను తప్పనిసరిగా ఫైల్ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బిఎల్ఓలదే కీలక పాత్ర అన్నారు.