సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం వైన్ షాప్ నుంచి అక్రమంగా బెల్ట్ షాపుల ద్వారా విక్రయించేందుకు రేగిడి మండలం అంబఖండి గ్రామానికి చెందిన సత్యం పది మద్యం బాటిళ్లను తరలిస్తుండగా గుళ్ల సీతారాంపురం గ్రామం సమీపంలో పట్టుకున్నట్టు ఎస్ఐ లోకేశ్వరరావు గురువారం తెలిపారు. ఈమేరకు సత్యంపై కేసు నమోదు చేసి, ఎస్ఈబీ పోలీసులకు అప్పగించామన్నారు. అక్రమంగా మద్యం బాటిల్ ను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ లోకేశ్వరరావు హెచ్చరించారు.