మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట బహుజన్ సమాజ పార్టీ నాయకులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలులో గిరిజన యువకుడైన నవీన్‌పై కొందరు అమానుషంగా దాడి చేశారని, అయినా పోలీసులు పెట్టీ కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దళితులపై దాడులు అరికట్టాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి రాస్తారోకో విరమింపజేశారు.