జాబు కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించేందుకు లక్ష్యంగా తీసుకుని పనులు చేయాలని ఉపాధి హామీ పథకం ఏపీఓ ఎస్ హరినాథ్ సిబ్బందికి సూచించారు. రేగిడి ఆమదాలవలస మండలం లచ్చరాయపురం గ్రామంలో గిరిజాలవాని చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను బుధవారం పరిశీలించారు. ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించే బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.