ఏపీ రాష్ట్రంలోని పలు బోధనాసుపత్రుల్లో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డీఎంఏ) ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నెల 26లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.