ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో జిమ్‌లో 24 ఏళ్ల వ్యక్తి ట్రెడ్‌మిల్ ఉపయోగిస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. నిర్లక్ష్యం వల్లే ప్రాణాపాయం జరిగిందన్న అనుమానంతో జిమ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో సక్షమ్ జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌ను ఉపయోగిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు నిర్ధారించారు. బుధవారం బీఎస్‌ఏ ఆస్పత్రి నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత విద్యుదాఘాతమే మృతికి కారణమని పోలీసులు నిర్ధారించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa